పల్నాడు జిల్లా :
మురసు తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి, రక్షణ కల్పించారు. వారికి అవసరమైన సదుపాయాలను సమకూర్చారు. తుఫాను ప్రభావంతో రోడ్డుపై కూలిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు అధికారులు తమ సిబ్బందితో కలిసి తొలగించడం జరిగింది.
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామమంలో లోతట్టు ప్రాంతమైన రజక కాలనీకి చెందిన సుమారు 150 మందిని నిర్మలా స్కూల్ లోని రిలీఫ్ సెంటర్ ను ఆర్టీసీ బస్ ద్వారా తరలించారు.
పెదకూరపాడు మండలంలోని కంభపాడు గ్రామం, మాచర్ల మండలం, పుల్లలచెరువు గ్రామం నుంచి వచ్చిన 20 మంది వలస కూలీలకు మురసు తుఫాను గురించి అవగాహనా కల్పించి, పక్కనే ఉన్న స్వర్ణ గ్రామ రిహాబిలిటేషన్ సెంటర్ కి వారిని తరలించడం జరిగింది.
రాయచూర్ నుండి పెదకూరపాడు మండలానికి వలస వచ్చిన సుమారు 250 మందిని పునరావాస కేంద్రం (రెహాబిటేషన్ సెంటర్) కు తరలించి, అల్పాహారం ఏర్పాటు చేశారు.
నూజెండ్ల మండలం, ఉప్పలపాడు గ్రామంలో రెహబటేషన్ సెంటర్ ఉప్పలపాడు ఎంపియూపి స్కూల్ లో టిఫిన్ ఏర్పాట్లు చేయడమైనది.
75 తాళ్లూరు నందు ఎస్.డబ్ల్యు.పి.సి షెడ్ వద్ద నున్న ఎస్టీ కాలనీ వాసులకు భారీతుఫాను వలన పక్కనే ఉన్న హైస్కూల్ లో బస ఏర్పాటుచేశారు. అత్యవసరమైన పరిస్థితులలో వెంటనే ఆ చోట నుండి హైస్కూలకు వెళ్లవలసిందిగా అవగాహన కల్పించారు.
నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టి కాలనీ నివాసులు రెహబటేషన్ సెంటర్ జడ్పీహెచ్ హైస్కూల్ నూజెండ్ల లో ఉదయం టిఫిన్ ఏర్పాటు చేయడమైనది.
